Friday, December 20, 2024

వామపక్షాలకు నాలుగు సీట్లు ఎక్కువే: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వామపక్షాలకు సీట్ల కే టాయింపుపై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంక ట్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు నాలుగు సీట్లు ఎక్కువేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టుల ఓట్లు ఏ మేరకు బదిలీ అవుతాయో పార్టీ అంతర్గతంగా అధ్యయనం చేస్తోందని చెప్పారు. సిపిఐ, సిపిఎం లతో పొత్తుల విషయంపై సాయంత్రంలోగా స్పష్టత వస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం వెంకట్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయనన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 70 నుండి 80 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టిక్కెట్ల కేటాయింపులో కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయమే తుదినిర్ణయమన్నారు. కాంగ్రెస్‌లో చాలా మంది చేరుతున్నారని, ఇంకా చేరికలు పెరుగుతాయన్నారు. కాంగ్రెస్ రెండో .జాబితా గు రువారం ప్రకటించవచ్చని ఆయన పేర్కొన్నారు.

రెండో జావితాలోనే అన్ని సెగ్మెంట్‌లకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నదన్నారు. సిఈసి తుది నిర్ణయం తీసుకునే వరకు ఎవరూ బయట మాట్లాడవద్దని సూచించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీ లో చేర్చుకునే విషయాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. రాజగోపాల్ రెడ్డితో పాటు వివేక్ వెంకటస్వామి కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయన్డి వెం కట్ రెడ్డి అన్నారు. రాజగోపాల్‌రెడ్డి చేరిక విషయం నేరుగా అధిష్టానంతోనే మాట్లాడారన్నారు. తనకు సమాచారం లేదని చెప్పారు. కర్ణాటకలో హామీ ఇచ్చిన పథకాలు అమలు అవుతున్నాయని, ఇక్కడ ఇచ్చిన గ్యారంటీలను కూడా తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. మిర్యాలగూడ అసెంబ్లీ సీటు తమకు బలమైన స్థానమని ్డ వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని తిప్పర్తి మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News