- Advertisement -
హైదరాబాద్: తెలంగాణను బిఆర్‌ఎస్ నేతలు విధ్వంసం చేయడంతో రాష్ట్రం వందేళ్లు వెనక్కి వెళ్లిందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. బిఆర్‌ఎస్-బిఎస్‌పి పొత్తుపై కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దిక్కులేక బిఎస్‌పి నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల తరువాత బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు బిజెపిలోకి వెళ్తారని జోస్యం చెప్పారు. సిఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొలేక కెసిఆర్ అసెంబ్లీకి రావడంలేదని చురకలంటించారు. ఎల్‌ఆర్‌ఎస్ గైడ్ లైన్ ఇంకా పూర్తి కాలేదని తెలియజేశారు. యాదగిరి గుట్ట అభివృద్ధి పేరుతో బిఆర్‌ఎస్ దోపిడీ చేసిందని కోమటి రెడ్డి ధ్వజమెత్తారు.
- Advertisement -