హైదరాబాద్: యాదగిరిగుట్టను పేరు మార్చడమే మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన పెద్ద తప్పు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చురకలంటించారు. హైదరాబాద్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అతి త్వరలో యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తామన్నారు. యాదగిరిగుట్టలో అవినీతి జరిగిందని, కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మండిపడ్డారు. దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి సర్వ నాశనం చేశారని ధ్వజమెత్తారు. పార్లమెంటు ఎన్నికల తరువాత విచారణ చేపడుతామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తాము గేట్లు తెరవలేదని, గేట్లు పగులగొట్టి కాంగ్రెస్‌లోకి వస్తున్నారని, కాంగ్రెస్‌తో 30 మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు టచ్‌లో ఉన్నారని, బిఆర్‌ఎస్‌లో ఒక్క ఎంఎల్‌ఎ కూడా మిగలరని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ రాష్ట్రంలో చూడలేదన్నారు.
ఆ పాపాలే కెసిఆర్‌కు చుట్టుకున్నాయి: కోమటిరెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -