Sunday, January 19, 2025

టచ్ చేసి చూడు…

- Advertisement -
- Advertisement -

కోమటిరెడ్డి.. మరో షిండే…

హస్తినలో గడ్కరీ, అమిత్‌షా భేటీలో
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదన చేశారు
ఆయనపై నమ్మకం లేక దానిని
బిజెపి పక్కన పెట్టింది ఐదుగురు
మంత్రులు మాతో టచ్‌లో ఉన్నారు
తలుచుకుంటే 48 గంటల్లో కాంగ్రెస్
ప్రభుత్వం కూలిపోతుంది బిజెపి
ఎంఎల్‌ఎలను ముట్టుకుంటే మా
తడాఖ చూపిస్తాం మీడియా
సమావేశంలో బిజెఎల్‌పి నేత
మహేశ్వర్‌రెడ్డి

మాతో టచ్‌లో ఐదుగురు మంత్రులు : మహేశ్వర్ రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో బిజెపి గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా ఐదుగురు కాంగ్రెస్ మం త్రులు తమ పార్టీ పెద్దలతో టచ్‌లో ఉన్నారని బిజెఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలోమీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని తమ ఎమ్మెల్యేలను ఒక్కరిని ముట్టుకున్నా 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. అసలు మీ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మీతో టచ్‌లో ఉన్నారో లేదో తెలుసుకోవాలని ప్రశ్నించారు. ఆయన భార్యకు భువనగిరి ఎంపి టికెట్ రాకుండా మీరే అడ్డుకున్నారంటూ ఆరోపించారు. ఎంపి రంజిత్‌రెడ్డిని ఎన్నోసార్లు విమర్శించారు, అవినీతి ఆరోపణలు చేశారు ఇప్పడు ఆయనకు ఏవిధంగా చేవెళ్ల ఎంపి టికెటు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నీ వసూళ్ల చిట్ట మా దగ్గర ఉందని, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని, భువనగిరి ఎంపినీ దమ్ముంటే గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. మంత్రి కోమటిరెడ్డి, దిల్లీలో నితిన్ గడ్కరీని, అమిత్‌షాతో సమావేశమై షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారని ఆరోపించారు. కోమటిరెడ్డిపై నమ్మకం లేకపోవడంతో బిజెపి పక్కన పెట్టిందని తెలిపారు. ఏ మంత్రి ఎప్పుడు తన సీటుకు ఎసరు తెస్తారోనని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భయంతో నిద్ర పట్టడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అభద్రతా భావంలో ఉందని దుయ్యబట్టారు. సిఎం హోదాలో ఉండి కాళేశ్వర్ంటపై సిబిఐ విచారణకు ఎందుకివ్వడం లేదన్నారు.

 

ప్రమాణం చేద్దాం.. వస్తావా?

మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌లోకి
వస్తానని ప్రాధేయపడ్డ మహేశ్వర్‌రెడ్డి
మాకు మెజారిటీ ఉందని, ఆయన
అవసరం లేదని నిరాకరించాం
ఆ అక్కసుతోనే అడ్డగోలు ఆరోపణలు
తప్పుడు ఆరోపణలు చేయడం
మహేశ్వర్‌రెడ్డికి అలవాటే
దమ్ముంటే గడ్కరీ, అమిత్‌షాను
తీసుకొని రా భాగ్యలక్ష్మి
ఆలయం వద్ద ప్రమాణం చేద్దాం
మంత్రి కోమటిరెడ్డి కౌంటర్

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తాను చెప్పని మాటలను చెప్పినట్టు అబద్ధాలు చెప్పి తనపై తప్పుడు ఆరోపణలు చేయడం మహేశ్వర్ రెడ్డికే చెల్లిందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. మొన్నటిదాక కాంగ్రెస్ పార్టీ లో చేరుతానని, సాయం చేయమని తనను అడిగిన బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆరోజు తనపై కామెంట్లు చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. తాను కాంగ్రెస్‌లోకి వస్తా అన్నా, మంత్రి పదవి కావాలని బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తనను అడిగారని, మాకే సరిపడా మెజార్టీ ఉందని, ఎవ్వరిని చేర్చుకోవాలన్న ఉద్దేశం పార్టీకి లేదని తాను చెప్పానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని మహేశ్వర్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నాడని కోమటిరెడ్డి ఆరోపించారు. తాను మహేశ్వర్ రెడ్డికి ఒక్కటే సవాల్ చేస్తున్నానని, ఆయనకు దమ్ముంటే నితిన్ గడ్కరిని, అమిత్ షాను తీసుకొని భాగ్యలక్ష్మీ టెంపుల్‌కు తీసుకురావాలని, తాను కూడా వస్తానని ప్రమాణం చేద్దామని ఆయన పేర్కొన్నారు. ఐదేండ్లకో పార్టీ మారే గాలిమాటల మహేశ్వర్ రెడ్డి రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి జెండా మార్చని నాపై విమర్శలు చేస్తవా అంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు. బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రజారాజ్యం, కాంగ్రెస్, బిజెపి, మధ్యలో బిఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్నారని, ఇలా ఆయన పోనీ పార్టీ ఈ రాష్ట్రంలో లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News