Wednesday, January 22, 2025

నల్లగొండను మోసం చేసింది ఆ ముగ్గురే: కోమటి రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన తరువాత బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు ప్రసంగించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ అవకాశం ఇవ్వడంపోడంతో దురదృష్టకరమైన విషయమన్నారు. సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. ఉత్తమ్ సత్యదూరమైన ప్రజంటేషన్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. కెఆర్‌ఎంబికి అప్పగించబోమని ప్రభుత్వం ప్రకటన చేయడంతో చేయడంతో ఇది తెలంగాణ ప్రజలు, బిఆర్‌ఎస్ విజయమని హరీష్ రావు ప్రశంసించారు. నల్లగొండలో బిఆర్‌ఎస్ సభ పెడుతామని చెప్పగానే ఈ ప్రకటన చేశారని తెలియజేశారు.

హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రీకౌంటర్ ఇచ్చారు. నల్లగొండ జిల్లాను బిఆర్‌ఎస్ నేతలు కెసిఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి మోసం చేశారని దుయ్యబట్టారు. జగదీశ్ రెడ్డి ముఖం చెల్లకే సోమవారం సభకు రాలేదని మండిపడ్డారు. కృష్ణా జలాల విషయం కెసిఆర్ ముక్కు నెలకు రాసి క్షమాపణ చెప్పాలని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ తరువాతే నల్లగొండకు రావాలని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. ఎసి అసెంబ్లీలో సిఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వినలేదా? అని ప్రశ్నించారు. ఎపి ముఖ్యమంత్రి జగన్ చెప్పినా కూడా కాంగ్రెస్ తప్పు చేసినట్లు చెబితే ఎలా అని అడిగారు. వెంటనే హరీష్ రావు మైక్ తీసుకొని కోమటి రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ అలా అనడం మంచిది కాదని హితువు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News