Monday, January 20, 2025

బిఆర్ఎస్ వాళ్లు వేరే దేశానికి వెళ్లి బతుకుతారనుకున్న: కోమటి రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ వాళ్లు ఎన్నికల్లో ఓడిపోయాక వేరే దేశానికి  వెళ్లి బతుకుతారనుకున్న…సిగ్గు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ…ఇలా వివిధ పథకాల పేర్లతో రూ.700000  కోట్లు దోచుకున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శనివారం మీడియాతో అన్నారు.

ఇంకా ‘‘అరే పిచ్చి కెటిఆర్..మీ లాగా అమలు చేయలేని హామీలు మేము ఇవ్వలేదు. ఎంత కష్టమైనా నెల మొదటి రోజే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం’’ అన్నారు. ‘‘కెసిఆర్ కొడుకంటే అందరూ గుర్తుపడతారు, కానీ కెటిఆర్ అంటే ఆయను ఎవరూ గుర్తుపట్టరు’’ అని ఎద్దేవా చేశారు. అధికారం పోయినా కెటిఆర్ అహం తగ్గలేదన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు కెటిఆర్ రెచ్చగొడితే రెచ్చిపోరని, తమకంటూ స్వతహాగా పౌరుషం ఉందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News