Friday, February 21, 2025

అక్రమాలు బయటపెడితే చంపేస్తారా?: కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన కుటుంబం తెలంగాణను దోచుకుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి హత్యపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. మాజీ సిఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు మాటలు విని ఒక మంచి వ్యక్తిని గండ్ర వెంకటరమణారెడ్డి హత్య చేయించడం మంచిది కాదన్నారు. కెసిఆర్ కుటుంబం అక్రమాలను బయటపెడితే చంపేస్తారా?నని కోమటి రెడ్డి ప్రశ్నించారు. న్యాయపరంగా కొట్లాడాలి కానీ… చంపేస్తారా?నని ధ్వజమెత్తారు. రాజలింగమూర్తి హత్యపై రేవంత్ రెడ్డిని కలుస్తామని తెలియజేశారు. కెసిఆర్ పై న్యాయపోరాటం చేస్తున్న చక్రధర్ గౌడ్ కు రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు దోపిడీపై రాజలింగమూర్తి పోరాడారని స్పష్టం చేశారు. కెసిఆర్ నుంచి ప్రాణభయం ఉన్నవారు ప్రభుత్వాన్ని సంప్రదించాలని కోమటిరెడ్డి కోరారు. రూ. 35 వేల కోట్లలో అయిపోయే కాళేశ్వరం ప్రాజెక్టును లక్షా ముప్పై అయిదు వేల కోట్లకు పెంచారని, ఈ దోపిడీ మీద రాజలింగమూర్తి కోర్టులో ఫైట్ చేస్తుండడంతోనే చంపేశారని ఆరోపణలు చేశారు.

మాజీ సిఎం కెసిఆర్ కొడుకును, అల్లుడిని రోడ్డు మీదికి వదిలి  హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజులకే అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం చేశారని దుయ్యట్టారు. కెసిఆర్ ఫాంహౌజ్‌కు పరిమితమై కొడుకు, అల్లుడు, పదిమంది చిల్లరగాళ్లను రోడ్డు మీద వదిలిపెట్టారని ఆయన ధ్వజమెత్తారు. రాజలింగమూర్తి హత్య బాధాకరమని, కోర్టులో అడ్వకేట్ సంజీవ్ రెడ్డి హార్ట్ అటాక్‌తో చనిపోయారని, అది కూడా అనుమానాస్పదమేనని మంత్రి విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News