Thursday, January 23, 2025

కెసిఆర్ తరువాత కెటిఆర్ సిఎం..!:రాజగోపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీలో ఎంత గట్టిగా మాట్లాడినా మంత్రి పదవి రాదని హరీశ్ రావు తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని హరీష్‌రావుపై రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ తరువాత బిఆర్‌ఎస్ నుంచి కెటిఆర్ సిఎం అవుతారే తప్పా హరీశ్‌రావు ఎంత కష్టపడి పనిచేసినా ఆయన్ను సిఎంను చేయరని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. తండ్రి, కుమారులు హరీశ్‌రావును వాడుకుంటారే తప్పా, న్యాయం చేయరని ఆయన పేర్కొన్నారు. తన మంత్రి పదవి గురించి కాంగ్రెస్ నాయకత్వం ఆలోచిస్తుందని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. కోమటిరెడ్డి మాట్లాడిన మాటల నేపథ్యంలో సభలో బిఆర్‌ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభలో ఇలాంటి గొడవలు సరికావని మంత్రులు శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క సర్ధిచెప్పారు.

హరీష్ రావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నాం
అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ వేశారు. రూ.50 కోట్లు పెట్టి రేవంత్ పిసిసి తెచ్చుకున్నారని గతంలో కోమటిరెడ్డి విమర్శించారని సభలో హరీష్‌రావు వ్యాఖ్యానించారు. దీంతో మంత్రి శ్రీధర్ బాబు కలుగజేసుకుని హరీష్ వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలని ఆయన కోరారు. దీనికి హరీష్ రావు మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి విత్ డ్రా చేసుకుంటే తాను చేసుకుంటానన్నారు. ఈ క్రమంలో హరీష్ రావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నామని స్పీకర్ తెలిపారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మా పార్టీ సిఎంగా రేవంత్‌ను ఎన్నుకున్నారు. పదేళ్లు మీరేం చేశారో చెప్పాలని. మీ బావ బామ్మర్దులు ఎలా కొట్లాడారో చెప్పాలా అని హరీష్ రావు విమర్శలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News