Wednesday, January 22, 2025

బిజెపిని వీడడం లేదు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రానున్న ఎన్నికల కోసం దుష్ప్రచారాలతో బిజెపిని బలహీనం చేసే కుట్రలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఆ వార్తలను ఎవరూ నమ్మొద్దని.. బిజెపిలోనే తాను కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు.

కర్ణాటక ఫలితాలు చూసి కాంగ్రెస్‌లోకి మళ్లీ రావాలని నా మిత్రులు అడుగుతున్నారు. నేను బిజెపిని వీడుతున్నట్లు కొన్ని తప్పుడు వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి కోట్లు రూపాయలు సంపాదించారు. ఆయన 20 ఏళ్లు టిడిపిలో ఉండి కాంగ్రెస్‌లోకి వచ్చారు. మేం ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌లోనే ఉన్నవాళ్లం.

also Read:

ఈ మధ్యే వచ్చిన రేవంత్ నాయకత్వంలో ఎలా పనిచేయాలి? నేను డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదు.. పోరాడే వ్యక్తిని. దుష్ప్రచారంతోనే మునుగోడు ఉప ఎన్నికలో నన్ను ఓడించారు. కెసిఆర్‌ను గద్దె దింపేందుకే బిజెపిలోకి వచ్చాను. కర్ణాటక, తెలంగాణలో ఒకే తరహా పరిస్థితులు లేవు. అసలు ఎన్నికల్లో గెలవకముందే రాష్ట్ర కాంగ్రెస్‌లో విభేదాలు వస్తున్నాయి. జీవితంలో ఏనాడూ తప్పు చేయలేదు. డబ్బు, అధికారం కోసం అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. కేవలం రాజకీయంగా ఎదుర్కోలేకే దుష్ప్రచారం చేసి ఓడించారు. పారదర్శకంగా నా కంపెనీకి టెండర్ వచ్చింది. అప్పులపాలైన తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం మోడీ. అమిత్ షా నాయకత్వంలోని బిజెపికే సాధ్యమనే నమ్మకంతో పార్టీలో చేరా.

బిఆర్‌ఎస్‌ను ఓడించే శక్తి బిజెపికే ఉందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. మీడియా చేసే దుష్ప్రచారాలకు భయపడే వ్యక్తిని కాదు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌నుమార్చాలని ఎవరూ లాబీయింగ్ చేయడం లేదు. ఎన్నికల సంవత్సరం కాబట్టి బిజెపిపై దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇదంతా పార్టీని బలహీనం చేసే కుట్ర తప్ప మరేమీ లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News