Sunday, December 22, 2024

మంత్రి పదవి కోసం పైరవీలు చేయను : రాజగోపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

తాను మంత్రి పదవికోసం పైరవీలు చేయనని, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పల్లరాజేశ్వర్ రెడ్డితో సంభాషించారు. ఈ సందర్బంగా అసలు గేమ్ ఇప్పుడు స్టార్టయ్యిందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జైలుకుపోయే వారిలో మొదటి వ్యక్తి అవుతాడని అభిప్రాయపడ్డారు.

తాము కేసీఆర్‌లాగా ఒక్కో ఎమ్మెల్యేకు 20, 20 కోట్లు ఇచ్చి కొనలేమని చెప్పారు. కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికలో తనను ఓడించేందుకు 300 కోట్లు ఖర్చు చేసి కర్ణుడిని ఓడించినట్టు తనను చేశారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక ఎఫెక్ట్ బీఆర్‌ఎస్ పై పడిందని, అందుకే కేసీఆర్ అధికారం కోల్పోయాడని చెప్పారు. తాను మంత్రి పదవి కోసం పైరవీలు చేయనని, అయ్యేది ఉంటే సిఎం కావచ్చని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News