Wednesday, January 22, 2025

భావి సిఎం ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాష్ట్రానికి సిఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో ఎప్పటికైనా ఉత్తమ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అసలు ఇప్పటికే ఉత్తమ్ సిఎం అవ్వాల్సి ఉందని, జస్ట్ మిస్ అయ్యిందన్నారు. తన నాలిక మీద మచ్చలు ఉన్నాయని, తాను ఏదైనా అంటే అది కచ్చితంగా జరుగుతుందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అందుకే తాను ఊరికే అనడం లేదని, నిజంగా జరిగేదే చెబుతున్నానని, అతి త్వరలో ఉత్తమ్ కుమా ను మనం ముఖ్యమంత్రి గారు అని పిలుస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలతో రేవంత్ సిఎం కావడం కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లకు ఇష్టం లేకపోవడం వల్లే రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News