Wednesday, January 22, 2025

బిజెపి మరో వికెట్ ‘డౌన్’!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల వలసలు ప్రారంభమయ్యాయి. బిఆర్‌ఎస్ నుంచి బహిష్కరించబడిన మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మంలో జరిగిన తెలంగాణ జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరగా, మాజీ మంత్రి జూపల్లి కూడా త్వరలో మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగసభలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అజీజ్‌నగర్‌లోని ఓ ఫాంహౌస్‌లో సమావేశం అయ్యారు. కాంగ్రెస్‌లో చేరికపై ఇరువురు నేతలు చర్చించినట్టుగా సమాచారం. రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో పొంగులేటితో రాజగోపాల్ రెడ్డి భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికే రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. పార్టీని వీడిన నేతలంగా తిరిగి చేరాలని, బిజెపి మునిగిపోయే నావా అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్వయంగా పేర్లు సైతం ప్రకటించి తిరిగి పార్టీలో చేరాలని వారిని ఆహ్వానించారు.

బిజెపి పదవి ఇవ్వకపోవడంతో….
దీంతోపాటు రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకట్ రెడ్డి సైతం అందరూ తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారని వ్యాఖ్యానించడం కొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి సొంతగూటికి చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పొంగులేటి, రాజగోపాల్ రెడ్డి భేటీ చర్చనీయాంశమైంది. అయితే, కొంతకాలంగా బిజెపిలో అసంతృప్తిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడేం నిర్ణయం తీసుకోలేనని పొంగులేటితో చెప్పినట్లుగా సమాచారం. పార్టీ మార్పుపై రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఎలాంటి స్పష్టత నివ్వలేదని తెలుస్తోంది. అయితే తాను బిజెపిని వీడాలన్న ఉద్దేశం లేదని, ఆ పార్టీ నాయకత్వంపై విశ్వాసం ఉందని పొంగులేటితో పేర్కొన్నట్టుగా సమాచారం.

రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని బయటకు వ్యక్తం చేయకపోయినా ఆయన బిజెపిలో ఇమడలేకపోతున్నారని కాంగ్రెస్ నాయకత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో పొంగులేటిని రంగంలోకి దించినట్టుగా తెలిసింది. దీంతోపాటు బిజెపి కేంద్ర నాయకత్వం తాజాగా తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవిలో మార్పు చేసి బండి సంజయ్‌ను తొలగించి జి.కిషన్ రెడ్డిని నియమించడం, ఈటలకు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా చేసినా తనకు మాత్రం తగిన బాధ్యత ఇవ్వకపో వడంతో రాజగోపాల్ రెడ్డిని నిరాశ పరిచిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని సీనియర్‌లు పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News