Thursday, January 23, 2025

బిజెపికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : డబ్బు, పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని కాదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బిజెపికి ఆయన రాజీనామా చేసిన సందర్భంగా బుధవారం మొయినాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో.. బిజెపి నుంచి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకోవడానికి గల కారణాలను ఆయన వివరించారు. ఈ నెల 27న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రె స్ పార్టీలో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడా. రాష్ట్ర సాధనలో ఎంపిగా నా పాత్ర పోషించానని ఆయన వెల్లడించారు.

దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలు చూసి బిజెపిపై అప్పుడు నమ్మకం కలిగింది. ప్రస్తుతం బిజెపి నాయకత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల కారణంగా ప్రజల్లో నమ్మకం పోయింది. ఎల్బీనగర్, మునుగోడు టికెట్ ఇచ్చేందుకు బిజెపి సిద్ధపడింది. కానీ, ప్రజల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌లో ఉంటేనే మీరు గెలుస్తారని ప్రజలు నాతో చెప్పారు‘ అని రాజగోపాల్ రెడ్డి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News