Monday, December 23, 2024

మునుగోడు నుంచే పోటీ చేస్తా:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారంనాడు ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు థాక్రే సమక్షం లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సంద ర్భంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అంతుకు ముందు ఉదయంమే రాజగో పాల్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. గురువారం ఆయన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం జరిగింది.

ఈ భేటీ అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మునుగోడు నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఈ విషయాన్ని అధిష్టానంకు చెప్పినట్లు తెలిపారు. పార్టీ ఆదేశిస్తే గజ్వేల్ లేదా కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. కెసి వేణుగోపాల్‌తో కూడా ఈ విషయంపై చర్చించినట్లు ఆయన తెలిపారు. మునుగోడుతో పాటు గజ్వేల్ నుంచి కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News