Wednesday, January 22, 2025

కాంగ్రెస్‌లో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!

- Advertisement -
- Advertisement -
మునుగోడు, ఎల్బి నగర్, మహేశ్వరం నుంచి బరిలో దిగే అవకాశం

మనతెలంగాణ/ హైదరాబాద్ : బిజెపి తరుపున మునుగోడు ఉప ఎన్నికల బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? ఈ విషయం సంచలనంగా మారింది. బిజెపికి ఆయన గుడ్ బై చెబుతారని సోషల్ మీడియా, కొన్ని ఛానెల్స్ ద్వారా విస్తృత ప్రచారం సాగుతోంది. మరోవైపు బిజెపి ప్రకటించిన 52 మంది తొలి జాబితాలో రాజగోపాల్ పేరు లేదు. దీంతో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరందుకుంది. ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత.. బిజెపిలో క్రియాశీలకంగా లేని రాజగోపాల్.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. పార్టీని వీడి.. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మీడియా ప్రచారాన్ని ఆయన ఖండించలేదు. దీంతో ఇది నిజమేనా అనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా తాను బరిలో నిలిచిన మునుగోడుతో పాటు ఎల్‌బి నగర్, మహేశ్వరం స్థానాలపై దృష్టి సారించినట్లు సమాచారం.

మునుగోడు స్థానం వామపక్షాల పొత్తులో కేటాయిస్తే.. ఎల్ బినగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఏదైన స్థానం నుంచి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని సమాచారం. ఇదే విషయమై ఆయన తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో చర్చిస్తున్నట్లు తెలిసింది. పార్టీ మార్పుపై రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆలోచనకి అనుగుణంగానే నా భవిష్యత్ నిర్ణయం ఉంటుందన్నారు. బిఆర్‌ఎస్ దుర్మార్గ పాలన విముక్తి కోసమే నా పోరాటమన్నారు. మునుగోడు కార్యకర్తలు.. నాయకులు.. ప్రజల ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. నాపై ఎంత దుష్ప్రచారం చేసినా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం ఆపలేదని, ఇకపై అపబోనని అన్నారు. తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని గతంలో ప్రజలు ఒత్తిడి తెచ్చారని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News