Monday, December 23, 2024

బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బిజెపి నియమించింది. జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఆదేశాల మేరకు బుధవార పార్టీ జాతీయ కార్యదర్శ అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర బిజెపిలో అధిష్టానం పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కీలక పదవిని వరించింది. కొంతకాలంగా రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డిని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. కోమటిరెడ్డి నియామకం తక్షణమే అమల్లోకి వస్తోందని తాజా ఉత్తర్వుల్లో వెల్లడించారు.

కాగా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఒక్కసారిగా తెలంగాణలో కూడా పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ వీడిన నేతలు ఒక్కొక్కరుగా మళ్లీ హస్తం పార్టీలోకి చేరుతున్నారు. రాజగోపాల్‌రెడ్డి కూడా మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనక పోవడంతో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇటీవల కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో మార్పుల నేపథ్యంలో బిజెపి అధిష్టానం అప్రమత్తం అయ్యింది. ఈ క్రమంలోనే పార్టీ నుంచి రాజగోపాల్‌రెడ్డి వెళ్లిపోకుండా ఇలా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News