హైదరాబాద్: వికారాబాద్ కలెక్టర్ పై జరిగిన దాడిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులకు దిగిన వారికి మద్దతిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని మండిపడ్డారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంగ్ కేటీఆర్‌పై ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం ఉందని కోమటిరెడ్డి అన్నారు. గతంలో ఎస్సీల భూములు లాక్కుంటే ఈ తరహా దాడులు చేయలేదని చెప్పారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎఫ్-1 కార్యక్రమం నిర్వహించినప్పుడు విదేశీ లావాదేవీలు జరిగాయని.. మున్సిపల్ మంత్రి ఆదేశాలతో కార్యక్రమం చేసినట్లు కమిషనర్ చెప్పారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
కాగా, లగచర్లలో కలెక్టర్ పై జరిగిన దాడి ఘటనపై కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతల మాటల యుద్ధం నడుస్తోంది. ఇది కావాలనే చేసిన బిఆర్ఎస్ కుట్ర అని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. ఇది కుట్ర కాదని, రైతులే తమ భూములు ఇవ్వడం ఇష్టంలేక దాడి చేశారని బిఆర్ఎస్ అంటోంది.