- Advertisement -
ఎమ్మెల్యేలుగా ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దామంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంలో ఎంపిగా పోటీ చేద్దాం.. దమ్ముంటే రా అంటూ కెటిఆర్, సిఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. దీంతో కెటిఆర్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ..
“ఎమ్మెల్యేలుగా ఇద్దరం రాజీనామా చేద్దాం.కేటీఆర్ పై నేను సిరిసిల్లలో పోటీ చేస్తా.. ఓడిపోతే, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. సిరిసిల్లలో కేటీఆర్ ఓడిపోతే.. బిఆర్ఎస్ పార్టీ మూసేస్తామని ప్రకటించాలి” అంటూ మంత్రి కోమటిరెడ్డి సవాల్ విసిరారు
- Advertisement -