హైదరాబాద్: కాంగ్రెస్ నేతల పంచాయతీ హైకోర్టుకు చేరింది. ఎంపి కోమటి రెడ్డిపై హైకోర్టులో చెరుకు సుధాకర్ పిటిషన్ వేశారు. తనను బెదిరింపులకు గురిం చేసిన ఎంపి కోమటి రెడ్డిపై కేసు నమోదు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. కోమటిరెడ్డిపై హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సుధాకర్ పిటిషన్ దాఖలు చేశారు.
గతంలో కాంగ్రెస్ ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు, ఆ పార్టీ నేత చెరుకు సుధాకర్‌ను చంపుతానంటూ బెదిరింపులకు దిగడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైన విషయం తెలిసిందే. చెరుకు సుధాకర్ కొడుకుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా ఫోన్ చేసి అసభ్య పదజాలంతో విరుచుకుపడిన విషయం విధితమే. ప్రజల్లో తిరిగినా తనపై స్టేట్ మెంట్ ఇచ్చినా చెరుకు సుధాకర్‌ను చంపడంతో పాటు ఆయన కొడుకు హాస్పటల్ సైతం ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. తనపై ప్రకటనలు ఇస్తే ఊరుకోబోమని చంపేయడం ఖాయం అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్‌లో హెచ్చరించడంతో చెరుకు అభిమానులు కూడా ఆగ్రహంగా ఉన్నారు. చెరుకు సుధాకర్‌ను చంపేందుకు 100 కార్లలో తన అనుచరులు, అభిమానులు తిరుగుతున్నారని, వారి అభిమానాన్ని తాను ఆపలేనని హెచ్చరించారు.