- Advertisement -
హైదరాబాద్: ఎస్ఎల్ బిసి ప్రమాదాన్ని రాజకీయం చేయడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎస్ఎల్‌బిసి ప్రమాద స్థలి దోమలపెంటకు ఆయన బయలుదేరి వెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు నిరంతరం అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ…గతంలో తూప్రాన్ రైలు ప్రమాదంలో.. స్కూల్ విద్యార్థులు చనిపోతే కెసిఆర్ కనీసం పరామర్శించలేదని విమర్శించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పారు. ఆపదలో ఉన్నవారికి మనం మనోధైర్యం ఇవ్వాలని, బాధితులను సురక్షితంగా తీసుకురావడానికి సలహాలు ఇవ్వాలన్నారు. ఇది రాజకీయాలు మాట్లాడే సమయం కాదని.. అందరినీ బయటకు తెచ్చిన తర్వాత మళ్లీ పనులు మొదలు పెడతామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
- Advertisement -