సోనియా, రాహుల్, విహెచ్ లాంటి వారినే గౌరవిస్తా
నాడు సోనియాను దెయ్యం అన్నవారికి నేడు దేవతా
ఆదివారం నుంచి ఎల్లారెడ్డితో ప్రారంభించి ఉద్యమం నడుపుతా
రేవంత్‌పై పరోక్షంగా నిప్పులు గక్కిన కోమటిరెడ్డి
నాడు వాళ్లకు సోనియా దెయ్యం, నేడు దేవతా?
హుజూరాబాద్‌లో నాయకత్వం ఏమైంది?
ఎంపి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల్లో ఘోరపరాభవం తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరాలు నానాటికీ పెరుగుతు న్నాయి. పిసిసిపై అసహనంతో రగిలిపోతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బుజ్జగించేందుకు సీనియర్ నాయకుడు విహెచ్ శనివారం నాడు భేటి అయ్యారు. ఈక్రమంలో పిసిసి టార్గెట్‌గా కోమటిరెడ్డి మరోసారి సంచ లన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లా డుతూ ఇందిరా గాంధీ చేయని ధైర్యం సోనియా గాంధీ చేశారని గుర్తుచే శారు. తాను రాజకీయాలు మాట్లాడనని, విహెచ్ అంటే తనకు అభిమా నమని, పార్టీ కోసం ప్రాణం ఇచ్చే నాయకుడు విహెచ్ అని కొనియాడారు.
సోనియా, రాహుల్ తమ నాయకులు అని, విహెచ్ వంటి వాళ్లను గౌరవిస్తానని స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి నుంచి ఉద్యమం మొదలుపెడుతానని, ఆదివారం నాటి నుంచి నా సత్తా చూపిస్తానంటూ తేల్చిచెప్పారు. అప్పడూ.. ఇప్పుడూ…ఎప్పుడూ సోనియానే దేవత అని కాగా పెద్ద లీడర్లు అని చెప్పుకొని- పదవుల పంపకాలు చేసుకున్నవాళ్లకు నాడు దెయ్యం నేడు దేవతగా మారారని ఆరోపించారు. ఎపిలో అసలు కాంగ్రెస్ లేదనుకుంటే బద్వేల్ ఉప ఎన్నికలో 6వేల ఓట్లు వచ్చాయని, తెలంగాణలో ప్రభుత్వం రావడం ఖాయమని చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్‌లో కనీసం డిపాజిట్లు రాలేదంటే నాయకత్వం ఏమైనట్టని ఎంపి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.