Sunday, December 22, 2024

కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలందరూ సిఎం అభ్యర్థులే: వెంకట్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సిఎం అభ్యర్థి ఎవరన్న విషయమై ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలందరూ సిఎం అభ్యర్థులే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఎం అవ్వడంపై తనకు ఆసక్తి లేదని ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా దృష్టి పెట్టామన్నారు.

అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 80 స్థానాల్లో గెలుస్తుందని మరోసారి ఆయన స్పష్టం చేశారు. దీంతో పాటు సిఎం ఎవరన్న విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందని ఎంపికోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News