Saturday, November 2, 2024

భువనగిరిలో దళితబంధు ఇస్తే రాజీనామా చేస్తా

- Advertisement -
- Advertisement -

Komatireddy venkat reddy Comments on dalitha bandhu

వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతిస్తా
భువనగిరి కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భువనగిరి పార్లమెంట్ పరిధిలోని దళితులకు, వాసాలమర్రి మాదిరిగా దళిత బం ధు పథకం లబ్ధి చేకూరితే, తాను భువనగిరి పార్లమెం ట్ పదవికి రాజీనామా చేస్తానని, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మ ండలం సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులు ముఖ్యం కా దని, పార్లమెంట్ పరిధిలోని దళితుల సంక్షేమమే ముఖ్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కి నిజం గా దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే భువనగిరి పార్లమెంట్ పరిధిలోని దళితులందరికి దళితబంధు పథకం కింద నిధులు మంజూరు చేయాలని అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు పలుకుతానని అన్నారు.

దక్షిణ తెలంగాణపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నచూపు చూపుతున్నారని ఆయన అన్నారు ఉప ఎన్నికలు వచ్చినప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కి అభివృద్ధి గుర్తుకొస్తున్నాయా అన్ని మండిపడ్డారు. సిఎం హోదాలో కేసీఆర్ అబ్ద్దాలు ఆడ్డం సిగ్గుచేటని విమర్శిచారు. తెలంగాణ అంటే మర్యాదకు మారు పేరన్ని… అలాంటి రాష్ట్రంలో విపక్ష ప్రజాప్రతినిధులకు గౌరవించకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. ప్రోటోకాల్ పాటించకుండా పోలీసులు, రౌడీలతో భయభ్రాంతులకు గురిచేస్తూ కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని వివరించారు. వాసాలమర్రి గ్రామంలో రెండు సార్లు సభపెట్టి ఎంపీగా తనకు కనీసం సమాచారం ఇవ్వలేదని వెల్లడించారు. ఓకే వేదికపై సీఎం ప్రన్కన కూర్చుంటే తన పరువు పోతుందాన్నారు.హైద్రాబాద్ ఓఆర్‌ఆర్ గౌరెల్లి నుంచి ఛతీస్‌గడ్ భోర్డర్ వరకు నూతన్నంగా మంజూరైన జాతీయ రహదారి వల్ల్ల వైజాగ్ నుంచి హైద్రాబాద్‌కు 120 కి.మీల దూరం తగ్గ్గుతుందన్ని తెలిపారు. చౌటుపల్ల్ పట్టణంలో రూ. 85 కోట్ల 4 వీయూపీలకు నిధులు మంజూరైనట్టు ్ల తెలిపారు. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి శ్రీశైలం సొరంగం, బ్రాహ్మణ వెల్లంల మిగిలిన పనులు పూర్తిచేస్తే 4లక్షల ల ఎకరాలకు కృష్ణా నీరు దక్కి ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యస్యామలంఅవుతుందని వివరించారు. కాళేశ్వరం లక్షల కోట్లు ఇవ్వొచ్చు కానీ 70శాతం పూర్యైన ప్రాజెక్టులకు వెయ్యి కోట్లు ఇచ్చేందుకు సర్కార్ మీనమేషలు లెక్కిస్తుందాన్నారు.

దళితులని మోసం చేయాడీనికే కేసీఆర్ కంకణం కట్టుకుకున్నారని విమర్శించారు. ఎన్నికలు వస్తేనే దోరవారికి దళితులు మీద ఎక్కడలేని ప్రేమ పొంగుతుందాన్నారు. మూడెక్రాల భూమి,దళిత సీఎం అని మోసం చేయడం తప్ప దళుతలకు ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మంత్రిర్గంలో దళితులను సరైన ప్రాతినిధ్యం లేదని దుయ్యాబట్టారు. హుజురాబాద్ ఎన్నిక్ల కోసమే దళిత బంధు అంటూ కొత్త నాట్కానికి తెర్లేపార్ని తెలిపారు. ఎన్నిక్ల తరువాత దళితులను పట్ట్టించుకోడని మండిప్డ్డారు. దళిత బంధు మాదిరిగానే బీసీ బంధు, మైనార్టీ బంధు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు జీతాలు ఇవ్వ్డానికి కోకాపేట భూములు అమ్ముకున్న కేసీఆర్ దళిత బంధుకు లక్షలకోట్లు ఎకిడిని ్డ నుంచి తీసుకువస్తున్నారో చెప్పాల్ని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News