Monday, December 23, 2024

నాకు ఎలాంటి పదవులు అక్కర్లేదు

- Advertisement -
- Advertisement -

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy venkat reddy don't want Positions

మన తెలంగాణ/హై-దరాబాద్: తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదని.. కొత్తతరం నాయకులను ప్రోత్సహిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు అండగా వుంటామని స్పష్టం చేశారు. ఫార్మా కంపెనీలకు భూమి ఎంతకు అమ్ముతున్నారో.. భూములిచ్చిన రైతుకి అంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఇకపోతే… గత మంగళవారం రేవంత్ రెడ్డితో కలిసి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను చనిపోయినప్పుడు మూడు రంగుల జెండా కప్పమని చెప్పానన్నారు. నాది ఒకే మాట, ఒకే బాట అని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News