Thursday, January 23, 2025

రాహుల్ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమే: కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీపై వేటు వేసిన తీరు కంటతడి తెప్పిస్తుందని పార్టీ ఎంపి కోమటిరెడ్డి వెంటర్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమేనని ఆయన పేర్కొన్నారు. రాహుల్ పై అనర్హత వేటును నిరసిస్తూ ఆదివారం గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు దీక్ష చేశారు.

ఈ క్రమంలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ…. అదానీ కుంభకోణం గురించి మాట్లాడినప్పటి నుంచి రాహుల్ పై కుట్రలు చేశారని ఆరోపించారు. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు ఎత్తివేసే వరకు తమ పోరాటం కొనసాగుతోందన్నారు. ముందు ముందు పోరాటం మరింత ఉధృతం చేస్తామమన్నారు. రాహుల్ ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా వదులుకున్నారని కోమటిరెడ్డి గుర్తు చేశారు. అవసరమైతే ఎంపీలంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై వేటు వేయడంతో దేశంలో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News