Wednesday, January 22, 2025

అన్నం పెట్టే రైతులకు సంకెళ్లా: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: రైతులకు సంకెళ్లు వేయడంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసనలు చేస్తే జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు బేడీలు వేయడం మంచి పద్దతి కాదని సూచించారు. రైతులకు సంకెళ్లపై కెసిఆర్ ఏం సమాధానం చేబుతారని? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.

అన్నం పెట్టే రైతులకు సంకెళ్లా.. రాయగిరి ట్రిబుల్ ఆర్ రైతులకు సంకెళ్లు వేయడం కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. రైతులపై కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తాతముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న కొద్దిపాటి భూమి పోతోందన్న బాధతో భువనగిరి, రాయగిరి, ఇంకా మిగిలిన గ్రామాల రైతులు పోరాటం చేస్తున్నారని వెల్లడించారు. శాంతియుతంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయినా, కొందర్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News