Wednesday, January 22, 2025

మల్లికార్జున ఖర్గేతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ నెల 10వ తేదీన ఎఐసిసి టిపిసిసి కమిటీలను ప్రకటించింది. ఈ కమిటీల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చోటు కల్పించలేదు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై చర్చించినట్టుగా సమాచారం. పిసిసి కమిటీ నియామకంలో కొందరు సీనియర్లకు చోటు దక్కని విషయాన్ని ఖర్గేకు వివరించారని సమాచారం. కమిటీల విషయంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఖర్గేతో చర్చించారు. ఈ నెల 12వ తేదీ సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్కకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫోన్ చేశారు. త్వరలోనే కలుద్దామని భట్టి.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ అభ్యర్థికి కాకుండా తన సోదరుడికి పోటు వేయాలని కోరినట్టుగా ఆడియో సంభాషణ బయటకు వచ్చింది. మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా కాంగ్రెస్ పార్టీపై ఆయన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని చెప్పారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంది.

ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ ఇంకా తన నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది. మరోవైపు పిసిసి కమిటీల నియామకం విషయంలో మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహా, పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేశారు. మరోవైపు బెల్లయ్య నాయక్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇక దామోదర రాజనర్సింహా మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తీవ్ర ఆరోపణలు గుపిపచారు. తెలంగాణలో అన్ని పార్టీలో కోవర్ట్ సంస్కృతి పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ పరిస్థితి ఉందన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా ఇతరులకు కమిటీలో చోటు కల్పించడంపై మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News