Sunday, January 19, 2025

అన్నీ అంశాలపై చర్చించాం: ప్రియాంక గాంధీతో భేటీపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

- Advertisement -
- Advertisement -

Komatireddy Venkat Reddy meets Priyanka Gandhi

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంతో పాటు దేశంలో పార్టీని బలోపేతం చేసే విషయమై ప్రియాంక గాంధీతో జరిగిన సమావేశంలో చర్చించినట్టుగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. బుధవారం నాడు రాత్రి ప్రియాంకగాంధీతో సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రియాంకగాంధీతో జరిగిన సమావేశంలో అనేక విషయాలపై చర్చించామన్నారు. రాష్ట్రంలో రాజకీయపరిస్థితులతో పాటు వచ్చే ఎన్నికల్లో అనుసరిం చాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా చెప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు నేతలంతా కలిసి పనిచేయాలని ప్రియాంక గాంధీ సూచించారన్నారు. సుమారు 40 నిమిషాలపాటు పార్టీకి చెందిన అంశాలపై చర్చించామన్నారు. ప్రియాంక గాంధీపై చర్చించిన పార్టీ అంతర్గత విషయాలను తాను మీడియాకు చెప్పబోనని చెప్పారు. ఏమైనా ఇబ్బందులుంటే ఎప్పుడైనా తనతో చెప్పాలని ప్రియాంక గాంధీ తనకు సూచించారనన్నారు. తనకు కూడా ప్రియాంక గాంధ కొన్ని సలహాలు, సూచనలు చేశారని కూడా చెప్పారు.

Komatireddy Venkat Reddy meets Priyanka Gandhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News