- Advertisement -
కాంగ్రెస్‌లో పరిణామాలపై అధిష్టానం స్పందించడం హర్షణీయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొనియాడారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఎందుకు ప్రచారం చేయలేదో తమకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ప్రవేశపెట్టిన పిసిసి కమిటీల్లో తాము ఇచ్చిన పేర్లను పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. పిసిసి కమిటీల్లో సీనియర్లకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పిసిసి చీఫ్‌తో సమానమని అన్నారు. పైరవీలు చేసుకునేవారికే కమిటీల్లో ఎక్కువ ప్రాధాన్యత కల్పించారని మండిపడ్డారు.
- Advertisement -