Saturday, April 26, 2025

కాంగ్రెస్ కు మంచి పేరు రావొద్దని.. కాళేశ్వరం కట్టారు: కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం కథ త్వరలోనే అందరికీ తెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ నాయకులపై ఫైరయ్యారు. రీడిజైనింగ్‌ పేరుతో కాళేశ్వరం చేపట్టి మోసం చేశారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివి ఉన్న ఎవరైనా కాళేశ్వరం చేపడతారా? అని విమర్శించారు. మేడిగడ్డ కుంగిపోవడం చిన్న విషయం అన్నట్లుగా మాట్లాడారని మండిపడ్డారు.

తమ్మిడిహట్టి ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుందని దానిని పక్కన పెట్టారని అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పనికిరావని ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇచ్చిందని ఆయన చెప్పారు. SLBCకి కాళేశ్వరానికి పోలికేంటని… కాళేశ్వరం అంశాన్ని డైవర్ట్‌ చేయాలని కెటిఆర్ ప్లాన్‌ చేశారన్నారు. కాళేశ్వరం నాణ్యత లోపానికి కారణమైన వాళ్లపై చర్యలు తప్పవని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News