Sunday, January 19, 2025

డిప్యూటీ లీడర్‌వా?..ఎమ్మెల్యేవా?: హరీష్ రావుకు కోమటిరెడ్డి కౌంటర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: అసెంబ్లీలో మరోసారి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మధ్య డైలాగ్ వార్ జరిగగింది. శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. అసలు, హరీష్ రావు.. డిప్యూటీ లీడరా?, లేక ఎమ్మెల్యేనా?.. ఏ హోదాలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయనకు అడిగే హక్కు లేదని అన్నారు. ప్రతిపక్ష నేత ఏడాదిగా సభకు రాకపోవడం సభనే కాదు.. తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని మంత్రి విమర్శించారు. నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన ఎలా ఉంటుందో చెప్పానన్నారు. డబ్బున్న వాళ్లు హైదరాబాద్‌ వచ్చారని.. లేని వాళ్లు అక్కడ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. హరీష్ రావుకు నల్గొండ గురించి, తన గురించి మాట్లాడే హక్కు లేదని కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News