Sunday, January 19, 2025

10 గంటల కరెంట్ ఇస్తే అక్కడ రాజీనామా చేస్తా… సవాల్‌కు సిద్ధమా కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి కెటిఆర్‌కు కాంగ్రెస్ ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. పది గంటలు కరెంట్ ఇస్తున్నట్లు కెటిఆర్ చూపిస్తే సబ్ స్టేషన్‌లోనే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్, ఎక్కడి సబ్ స్టేషన్‌కైనా వెళ్లాడని తాను సిద్దమన్నారు. అక్కడ లాగ్ బుక్‌ల్లో 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు చూపిస్తే జీవితాంతం బిఆర్‌ఎస్‌కు సేవ చేస్తానన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నారంటే సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేస్తానన్నారు. ఒక్కొక్క ఎంఎల్‌ఎ రూ. వెయ్యి కోట్లు తిన్నది అరగక ధర్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. తన సవాల్‌కు ఎవరొస్తారో రావాలని, కనీసం ఆరు గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారో చూపించాలన్నారు.

Also Read: వాలంటీర్ల తీరుతో చాలా ప్రమాదం పొంచి ఉంది: చంద్రబాబు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News