Tuesday, January 21, 2025

సందేశాత్మక చిత్రాలకే రేట్ల పెంపునకు అనుమతి

- Advertisement -
- Advertisement -

కిమ్స్ ఆస్పత్రి వద్ద రేవతి కుటుంబానికి రూ.25లక్షల చెక్కును అందజేస్తున్న
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

చరిత్ర, దేశభక్తి చిత్రాలకు
అనుమతిస్తాం రేవతి
కుటుంబానికి రూ.25లక్షల
చెక్కును అందజేసిన
సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: ఇకపై తెలంగాణలో బెన్ ఫిట్‌షోలు ఉండవని, బెన్‌ఫిట్ షోకు అనుమతి ఇవ్వాలంటే దేశ భక్తి లేదా తెలంగాణ చరిత్రకి సంబంధించిన సిని మా అయితే బాగుంటుదని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంక ట్‌రెడ్డి అన్నారు. మేసేజ్ ఓరియెంటెడ్ సినిమా ల విషయం వేరు, పుష్ప2 సినిమా వేరని, ఈ సినిమాను తాను కూడా చూశానని ఆయన పే ర్కొన్నారు. సంధ్య ధియేటర్ ప్రమాదంలో గా యపడిన సికింద్రాబాద్ కిమ్స్‌లో చికిత్స పొం దుతున్న శ్రీతేజను పరామర్శించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సాయంత్రం సికింద్రా బాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. శ్రీ తేజ్ తండ్రికి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ.25 లక్షల చెక్‌ను మంత్రి కోమటిరెడ్డి అందించారు. శ్రీ తేజ్ కు టుంబానికి అన్ని రకాల సాయం అందిస్తామని శ్రీ తేజ్ తండ్రికి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. తన సొంత ఖర్చులతో రేవతి పిల్లలిద్దరికీ చదువులు చెప్పిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ఆ కుటుంబం నుంచి ఒక్క పైసా తీసుకోవద్దని ఆస్పత్రి వారికి కూడా చెప్పానని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

తొక్కిసలాటలో రేవతి చనిపోయింది
ఈనెల 4వ తేదీన పుష్ప 2 బెనిఫిట్ షో కోసం సంధ్య థియేటర్‌కు మృతురాలు రేవతి, భాస్కర్, వారి పిల్లలు శ్రీ తేజ, సాన్విక వెళ్లారని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హీరో అల్లు అర్జున్ బౌన్సర్లతో అక్కడికి వచ్చారని, అక్కడే ఉన్న అన్ని థియేటర్లకు వచ్చిన సినిమా ప్రియులు అల్లు అర్జున్‌ను చూడటానికి వచ్చిన సమయంలో తొక్కిసలాట జరిగిందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఈ తొక్కిసలాటలో రేవతి చనిపోయిందని, ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లారని వెంటనే ఆస్పత్రికి తీసుకువచ్చినప్పటికి రేవతిని వైద్యులు బ్రతికించలేకపోయారని మంత్రి చెప్పారు. బాబు ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని, రేవతి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నానని మంత్రి పేర్కొన్నారు. పేద ఆర్య వైశ్య కుటుంబంలో జన్మించిన భాస్కర్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని మంత్రి తెలిపారు. వద్దన్నా వచ్చి థియేటర్లో హడావుడి చేసిన హీరో మీద కేసు నమోదు అయ్యిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తాను కామెంట్ చేయనని మంత్రి తెలిపారు. అబ్బాయి ఆరోగ్యం చాలా విషమంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.

ఇక సినిమాలు చూడొద్దని నిర్ణయించుకున్నా
ఇక నుంచి నో బెనిఫిట్ షోస్ అని, ఏదేమైనా దేశ చరిత్రకు సంబంధించి, ఇంకేదైనా దేశం గురించి తీసిన సినిమా అయితే ఆలోచిస్తామని మంత్రి వెల్లడించారు. పుష్ప 2తో ఇంకా బెనిఫిట్ షోలు రద్దు అని ఆయన చెప్పారు. తాను కూడా పుష్ప 2 చూసానని, కానీ, ఇక సినిమాలు చూడొద్దని నిర్ణయించుకున్నానని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. సినిమాలతో యువత చెడిపోతుందని ఆయన అన్నారు. ఇకపై సినిమా హీరోలు నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే సినిమా వాళ్లు బయటకు వెళ్లొద్దని, షోలు చేయడానికి బయటకు వచ్చి ఓపెన్ టాప్ కార్లలో తిరగవద్దని, ఇంకోసారి ఇలాంటి చర్యలు పునరావృత్తం కావొద్దని, సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తామని, అందరూ హీరోలు, నిర్మాతలు కో ఆపరేట్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.

శ్రీ తేజ పరిస్థితి చూస్తే భయం వేసింది
రాష్ట్ర ప్రభుత్వం తరపున భాస్కర్ కుటుంబానికి సారీ చెబుతున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. రేవతి భర్తకి పునర్జన్మ ఇచ్చి ఆమె వెళ్లిపోయిందని, ఈ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా తానే చూసుకుంటానని మంత్రి వెల్లడించారు. సిఎం ఆదేశించారని, ఆ అబ్బాయిని రక్షించుకోవడానికి ఎంత ఖర్చు అయినా తామే చూసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. శ్రీ తేజ పరిస్థితి చూస్తే భయం వేసిందని, రెండు మూడు రోజులు గడిస్తే చెప్పోవచ్చని వైద్యులు చెప్పారని, మాటలు రావొచ్చు రాకపోవచ్చని వైద్యులు చెబుతున్నారని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News