Thursday, January 23, 2025

కోమటి రెడ్డి బిసిలకు క్షమాపణ చెప్పాలి: జాజుల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు, బిసి సామాజికవర్గానికి చెందిన చెరుకు సుధాకర్‌పై భువనగిరి ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర పదాజాలంతో దూషించి, చంపుతామని బెదిరించడాన్ని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. అధికార దాహంతో, అగ్రకుల అహంకారంతో విచక్షణ కోల్పోయి ఒక బిసి బిడ్డను రాజకీయంగా అణచివేయాలని చెరుకు సుధాకర్ కుమారుడు డాక్టర్ సువాస్‌కు ఫోన్ చేసి బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఐదుసార్లు శాసనసభ్యులుగా, మంత్రిగా పనిచేసి ఎంపిగా కొనసాగుతున్న కోమటిరెడ్డి రౌడీలా మాట్లాడడం దారుణమన్నారు. బిసిలతో జెండాలు మోయించుకొని, ఓట్లు వేయించుకొని పదవులు అనుభవిస్తూ ఓట్లేసిన బిసిలపైనే దాడులు చేసి చంపుతామని బెదిరించడం బిసిల వ్యతిరేకి అని స్పష్టమవుతోందన్నారు. వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాలని జాజుల డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెరుకు సుదాకర్‌కు రక్షణ కల్పించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News