Friday, December 27, 2024

46 ఏళ్ల నిరీక్షణ… ‘ ప్రజావాణి ‘ తో సాకారం…

- Advertisement -
- Advertisement -

వంద రోజుల్లోనే అందిన పట్టాదారు పాసు పుస్తకం
సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన లబ్ధిదారు కొమ్మనబోయిన పిచ్చయ్య
మన తెలంగాణ/హైదరాబాద్ : 46 ఏళ్ల నుంచి ఒక ఎకరం సాగుభూమి పట్టాదారు పుస్తకం కోసం ఎదురు చూస్తున్న కొమ్మనబోయిన పిచ్చయ్య నిరీక్షణ ముఖ్యమంత్రి ‘ప్రజావాణి‘తో సాకారమైంది. మంగళవారం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన కొమ్మన బోయిన పిచ్చయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య లకు ధన్యవాదాలు తెలిపారు. నల్లగొండ జిల్లా నక్రేకల్ అసెంబ్లీ నియోజకవర్గం కట్టంగూరు మండలం ఎర్రసానిగూడెం గ్రామానికి చెందిన కొమ్మనబోయిన పిచ్చయ్య ఒక ఎకరం భూమి పట్టాదారు పాసుపుస్తకం కోసం ముఖ్యమంత్రి ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వంద రోజుల్లోనే భూమి పాస్ పుస్తకం చేతికి అందింది. 1978లో అందిన ఒక ఎకరం భూమి పట్టా సర్వే నెంబర్ 215/3 కి సంబదించి పట్టాదారు పాసు పుస్తకం కోసం పిచ్చయ్య రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన సీఎం ప్రజావాణి విషయం తెలుసుకున్న పిచ్చయ్య పట్టాదారు పాసు పుస్తకం కోసం గత జూలై నెలలో దరఖాస్తు చేసుకున్నారు. వంద రోజుల్లోనే భూమి పట్టాదారు పాసు పుస్తకం చేతికి అందింది అని పిచ్చయ్య ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన ఇద్దరు కుమారులు నరసింహ, స్వామి యాదవ్ లతో కలిసి ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి చిన్నారెడ్డి, దివ్య చేతుల మీదుగా పిచ్చయ్య పట్టాదారు పాసు పుస్తకం తీసుకున్నారు. ప్రజావాణి కార్యక్రమం ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ భరోసా కల్పిస్తోందని పిచ్చయ్య అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News