Sunday, January 19, 2025

పూటకో పార్టీ మారేటోడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

చేర్యాల: రోజుకో కండువా, పూటకో పార్టీ మారేటోడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అని ఓట్లు వేసి గెలిపిస్తే జనగామ నియోజక వర్గంను అభివృద్ధి చేస్తాడో ప్రజలు గమనించాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. ఆదివారం చేర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజక వర్గ ప్రజలు ఆనాడే చీకోట్టారని ఆంద్ర పాలకుల మోకాళ్ల దగ్గర తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టిన ఘనుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. చేర్యాల పట్టణంలో దాదాపు 33 ఎకరాల వెంచర్ చేసి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన 3 ఎకరాల 30 గుంటల భూమిని మింగిన ఘనుడు కొమ్మూరు ప్రతాప్‌రెడ్డి అని విమర్శించారు.

ఇప్పుడున్న పెట్రోల్ బంక్ భూమి కూడా చుంచన కోట గ్రామానికి చెందిన వెల్ధి లింగయ్య అనే వ్యక్తి నుంచి చేర్యాల పట్టణానికి చెందిన తడక లక్ష్మణ్ అనే వ్యక్తులను బెదిరించి పెట్రోల్ బంక్ నిర్మించిన స్ధలాన్ని అక్రమంగా తీసుకున్నారని త్వరలోనే విడతల వారిగా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి బాగోతాలను బయటపెడతానని తెలిపారు. తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క పాదయాత్ర జనగామ నియోజక వర్గంలో జరిగిన సమయంలో భట్టి విక్రమార్క నిన్ను దగ్గరికి కూడా రానీయలేదు.కనీసం నిన్ను గుర్తించలేదు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావో ఇప్పటికైనా తెలుసుకో అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అంకుగారి స్వరూపారాణి, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ సుంకరి మల్లేశం, వైస్ చైర్మన్ పుర్మ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు మంగోల్ చంటి, ఆడేపు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News