- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఐటి శాఖ మంత్రి కెటిఆర్ చొరవతో ఉత్తర హైదరాబాద్‌లో గేట్ వే ఐటి పార్క్ విశేష వృద్ధిని సాధించడం ఖాయమని కొంపల్లి ఐటి ఎంట్రప్రెన్యూర్స్ అసోసియేషన్ (కైటియా) అధ్యక్షులు, లాస్య ఐటి సొల్యూషన్స్ ఎండి ఓరుగంటి వెంకట్ అన్నారు. మేడ్చల్ జిల్లాలో కొంపల్లిలో గేట్ వే ఐటీ పార్క్ ఏర్పాటు పట్ల టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లును మంగళవారం ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. గేట్ వే ఐటి పార్క్ ఏర్పాటుకు సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కైటియా సభ్యుల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని ఐటి పార్క్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని టిఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు హామీ ఇచ్చారు.
- Advertisement -