Monday, January 20, 2025

కొంపెల్లి హైస్కూల్ విద్యార్థి బాసర ఐఐటికి ఎంపిక

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి: ఇటీవల విడుదలైన బాసర ఐఐటి అడ్మిన్ల ఫలితాలలో స్థానిక కొంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థి కొమ్ము ఆకాశ్ బాసర ఐఐటిలో అడ్మిషన్‌కు ఎంపికయ్యాడని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమరేందర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఉపాధ్యాయ బృందం సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ప్ర ధానోపాధ్యాయులు మాట్లాడుతూ వరుసగా రెండు సంవత్సరాలుగా ఇద్దరు విద్యార్థులు బాసర ఐఐటికి ఎంపికవ్వడం చాలా సంతోషకరంగా భావిస్తూ వారిని స్పూర్తిగా తీసుకొని ఈ విద్యాసంవత్సవరం(2023-..24)లో కూడా 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్రచారి, సురేందర్, ప్రసాద్, కార్తీక్, శ్రీలత, షహిదాబేగం, రజియా, పైడపనాయుడు, ఆలూరి రమేష్, శ్రీవిద్య, హైమావతి, శనిగరపు రమేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News