Monday, January 27, 2025

బాలుడిని చంపి… పూడ్చిపెట్టిన నాటు వైద్యుడు

- Advertisement -
- Advertisement -

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. రెబ్బెన మండలం పాసిగామ్ పూలాజీ బాబా ధ్యాన కేంద్రంలో నాటు వైద్యుడి నిర్వాకం బయటపడింది. తమ కుమారుడిని రిషి(10)ని చికిత్స కోసం నాటు వైద్యుడి వద్దకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. చికిత్స అందిస్తున్నానంటూ నాలుగు ఏళ్లుగా బాలుడిని తల్లిదండ్రులకు నాటు వైద్యుడు చూపించడంలేదు. అనుమానంతో పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నాటు వైద్యుడు భీమ్ రావును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అనారోగ్యంతో బాలుడు మృతి చెందాడని నాటు వైద్యుడు పేర్కొన్నారు. బాలుడి మృతదేహాన్ని ఆశ్రమం సమీపంలో పాతిపెట్టానని నాటు వైద్యుడు నోరు విప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమారుడిపై మంత్రప్రయోగం చేసి చంపి ఆశ్రమంలో పాతి పెట్టి ఉంటాడని బాలుడు తల్లిదండ్రులు, బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News