Sunday, December 22, 2024

కొమురవెల్లి మల్లన్న జాతరకు పోటెత్తిన భక్తులు..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న మహాజాతర ప్రారంభం అయ్యింది. కొమురవెల్లి మల్లన్న స్వామీని బండ సొరికల వెలసిన దేవునిగా కీర్తిస్తారు. సుతిమాను గుండు మీద త్రిశూలం ఉంటుంది. దాని ప్రక్కనే రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది. ఈ దేవుని ఎక్కువగ కురుమలు, గొల్లలు, కాపువారు పూజిస్తారు. గుడి ఎదురుగా గంగిరేణి వృక్షము ఉంది. ఈ ఆలయానికి 15 కి.మీ దూరంలో పోచమ్మ దేవి ఆలయం కూడా ఉంది. మల్లన్న ఆలయానికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు.
ఇక్కడ జాతర జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆదివారం, బుధవారాలలో జరుగుతుంది. సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణోత్సవం జరుగుతుంది పండుగ తరువాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంటనగరాల నుండి లక్షల సంఖ్యలో యాత్రికులు వచ్చి మొక్కుబడులు చెల్లిస్తారు. వీటిని లష్కర్ బోనాలుగా పిలుస్తారు. ఎక్కువగా యాదవ భక్తులు సందర్శించే ఈ జాతరలో బోనం, పట్నం అనే విశేషమైన మొక్కుబడులుంటాయి. ఈ సందర్భంగా ఈ జాతర 9 వారాల పాటు జరగనుంది. లష్కర్ వారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భక్తులతో మల్లికార్జున స్వామి ఆలయం కిటకిటలాడుతుంది. బోనాలు, పట్నాలతో భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News