Monday, November 18, 2024

వైభవంగా మల్లన్న పట్నం

- Advertisement -
- Advertisement -

కొమురవెల్లి: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సం క్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో మొదలై తొమ్మిది వారాల పాటు కొనసాగుతాయి. మొ దటి ఆదివారం ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తా రు. పట్నాలు, బోనాలు సమర్పించి స్వామివారిని ద ర్శించుకున్నారు. భారీగా భక్తులు తరలి రావడంతో ద ర్శనానికి గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. మొదటి ఆదివారం పట్నం వారం అంటారు. పెద్ద సం ఖ్యలో హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి యాదవ భక్తులు భారీగా తరలివచ్చారు. పట్నం వారం స్వామిని దర్శించుకున్న ఆనంతరం దీక్షలు విరమిస్తారు. స్వామివారితో పాటు పట్నం వేసి గుట్టపై ఎల్లమ్మ తల్లికి బో నం సమర్పిస్తారు. లక్ష మంది భక్తులు దర్శించుకున్న ట్లు ఆలయ వర్గాలు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి కల్యాణం పట్నం వా రం లష్కర్ వారం మహా శివరాత్రి రోజున నిర్వహించే ఉత్సవాల్లో భాగంగానే పెద్ద పట్నం, అగ్ని గుండాల కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మల్లన్నను దర్శించుకోవడానికి భక్తులు వేకువ జామునే కోనేటిలో స్నానమాచరించి భక్తి శ్రద్ధ్దలతో గంగిరేగుచె ట్టు వద్ద పట్నాలు, బోనాలు చేసి మమ్మేలు తండ్రి అని వేడుకున్నారు. ఆలయం మొత్తం పసుపు బండారితో కళకళలాడింది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ఆలయ ప్రాంగణం అత్యంత భక్తి శ్రద్ధ్దల తో నిండిపోయింది. ఎలాంటి ఇబ్బందులు కలగకుం డాఆలయ అధికారులు మంచి నీటి వసతి కల్పించారు. భక్తుల వాహనాలు లోపటికి అనుమతించకపోవడంతో ఆరు బయటే ఆలయానికి దూరంలో బస చేసి బోనాలు సమర్పించడానికి చాలా ఇబ్బంది పడ్డ భక్తులు ఇబ్బందితోనే స్వామివారిని దర్శించుకొని వెనుతిరిగారు.
నేడే అగ్ని గుండాలు
అత్యంత భక్తి శ్రద్ధ్దలతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు సంబంధించిన యాదవ భక్తులు అగ్ని గుండాల తంతును నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఎప్పటిలాగానే తమ సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఆదివారం ఆర్ధరాత్రి తర్వాత నిర్వహించే ఈ కార్యక్రమంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రా రంభం కానున్నాయి. ఈ అగ్ని గుండాలను శివసత్తులు పూనకాలతో తొక్కి తమ భక్తిని చాటుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News