Saturday, December 21, 2024

కొమురవెల్లిలో బాలికపై లైంగికదాడి… నిందితుడి ఇంటిని తగలబెట్టి

- Advertisement -
- Advertisement -

కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని ఓ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఏడో తరగతి బాలికపై యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిందితుడి ఇంటిని పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. యువకుడి కుటుంబానికి సంబంధించిన కారు, జెసిబిని ధ్వంసం చేశారు. గ్రామస్తుల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News