Thursday, January 23, 2025

కోనసీమలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి: పాలరాజు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని డిఐజి పాలరాజు తెలిపారు. కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని డిఐజి పాలరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు 62 మందిని అరెస్ట్ చేశామని, స్పందన దరఖాస్తులను మండలకేంద్రాల్లో ఇవ్వొచ్చన్నారు. పరిస్థితులను బట్టి ఇంటర్‌నెట్‌పై పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.  ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ ఆందోళన కారులు అమలాపురంలో మంగళవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీశాయి. ఈక్రమంలో అమలాపురంలోని బ్యాంక్ కాలనీలోని మంత్రి విశ్వరూప్‌కు చెందిన ఇంటికి నిప్పు పెట్టడంతో పాటు ఆయన ఇంట్లో వున్న కాన్వాయ్ వాహనాలతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టారు. విధ్వంస ఘటనలో 46 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News