మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో పెరుగుతున్న డ్రగ్స్ బెడదపై యువతలో అవగాహన కల్పించడానికి రేవంత్‌రెడ్డి ప్రారంభించిన వైట్ ఛాలెంజ్‌ను మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అంగీకరించారు. ఈ మేరకు గన్ పార్క్ దగ్గర జరిగిన కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. వైట్ ఛాలెంజ్ అనేది సమాజానికి మంచిదని అన్నారు.
మా స్థాయి వేరు అని రాజకీయ నేతలు మాట్లొడొద్దని.. పెద్ద రాజకీయ నేతలు చిన్న వ్యక్తుల దగ్గరకు వెళ్లి మాట్లాడుతారని అన్నారు. సైదాబాద్ సింగరేణి కాలనీ ఘటన డ్రగ్స్ వల్లనే అయ్యిందని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో నిలబడే ప్రతి లీడర్ డ్రగ్ టెస్టు తీసుకోవాలని, డ్రగ్ టెస్ట్ తీసుకున్న తరువాతే ఎన్నికల్లో నిలబడే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించాలని వ్యాఖ్యానించారు. కెటిఆర్.. రాహుల్‌గాంధీ గురించి తొందరపాటులో మాట్లాడుతున్నారని.. ఈ ఇష్యూకు రాహుల్‌కు సంబంధం లేదని, డ్రగ్ ఇష్యూ రాష్ట్రానికి చెందిన సమస్యని అన్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బండి సంజయ్‌ప్రవీణ్‌కుమార్‌కు వైట్ ఛాలెంజ్ విసిరారు. వైట్ ఛాలెంజ్ స్వీకరించి యువతకు ఆదర్శంగా నిలవాలని కోరారు.