Saturday, November 23, 2024

బిసిల కోసం నిండుమనుసుతో పనిచేస్తున్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Konda Laxman Bapuji 107th Birthday Annivarsary celebrations

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు హైదరాబాద్ రవీంద్రభారతిలో మంగళవారం ఘనంగా జరిగాయి. అంతకుముందే జలద్రుశ్యం వద్ద 15 అడుగుల కొండాలక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని మంత్రులు కేటీఆర్, గంగుల, తలసాని, ఎర్రబెల్లి తదితరులు ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ ఎల్.రమణ, హండ్లూమ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రారంభమైన సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… జాతీయోద్ద్యమం, రెండుదశల తెలంగాణ పోరాటం, సహకరా విప్లవంలో కొండా చేసిన కృషికి మరొకరు సాటిరారన్నారు. ఆయన పుట్టిన గడ్డపై జన్మించడం తెలంగాణ ప్రజల అద్రుష్టం అన్నారు, అలాంటి మహనీయుని ఇంటిని నాడు సమైక్య పాలకులు కూల్చిన చోటే నేడు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం నిజమైన నివాళి అన్నారు. ఈ ఘనతకు కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, విగ్రహావిష్కరణ చేసిన మంత్రి కేటీఆర్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు మంత్రి గంగుల.

నాడు 2013లొనే కరీంనగర్ నడిబొడ్డున కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించానని చెప్పిన గంగుల ఉద్యమ సమయంలో బాపూజీతో కలిసి పనిచేసిన రోజుల్ని గుర్తుచేసుకున్నారు. 96ఏళ్ల వయసులోనూ ఎముకలు కొరికే చలిలో డిల్లీలో దర్నాలో పాల్గొన్న తీరు, తొలిదశ సాయుద రైతాంగ పోరాటంలో న్యాయపోరాటం జరిపి విప్లవకారులకు అండగానిలిచిన తీరును స్మరించుకున్నారు. అదే స్పూర్తితో స్వరాష్ట్రం సాధించిన కేసీఆర్ గారు, బాపూజీ ఆధర్శాలతో పరిపాలన చేస్తున్నారన్నారు. ఈ సమయంలో సభికులు గుర్తు చేసిన సంఘటనను తలచుకొని బావోద్వేగానికి గురయ్యారు, మలిదశ ఉద్యమం సాగుతున్న సమయంలో అసెంబ్లీలో, గన్ పార్క్ వద్ద తెలంగాణ అనుకూల తీర్మానాన్ని సీమాంద్ర పాలకులు చింపేసి తొక్కుతుంటే ఆ చిత్తు ప్రతులను గుండెలకు హత్తుకొని జైతెలంగాణ అని నినదించామని, నేడు ఆ పోరాటానికి ఫలితం దక్కిందన్నారు మంత్రి గంగుల కమలాకర్. హర్టీకల్చర్ యూనివర్శిటీకీ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుపెట్టిన ముఖ్యమంత్రికి దన్యవాదాలు చెప్పారు.

తెలంగాణొస్తే ఏమొచ్చింది అని అడుగుతున్న వారికి నిన్న చాకలి ఐలమ్మ, నేడు కొండాలక్ష్మణ్ బాపూజీల ఘనమైన అధికారిక జయంతులే సమాదానం అన్నారు. బీసీలైన ఎల్.రమణ, చింతాప్రభాకర్, గూడూరు ప్రవీణ్ వంటి ఎందరో తెలంగాణ ముద్దుబిడ్డలు రాజ్యాధికారంలో బాగస్వాములైన విషయం కనబడడం లేదా అని ప్రశ్నించారు. నాడు 19 గురుకులాలతో అరకొర విద్యాసధుపాయాలుంటే నేడు బీసీలకు 310 విద్యాలయాలు, లక్షలాది విద్యార్థులు ఉన్నారని, ఆడబిడ్డ పెల్లికోసం అష్టకష్టాలు పడే తల్లుల కడుపుకోతను తీర్చేలా కళ్యాణలక్ష్మీ వచ్చిందని, సాగునీరు, తాగునీరు, విద్యుత్, మద్దతుదర ఇలా అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇంత చేస్తున్న ముఖ్యమంత్రికి మన ఆశీర్వాదాలు అందజేయాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, ఉపేంద్ర, బీసీ సంఘాల నేతలు, బీసీలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News