హైదరాబాద్: కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర సాధనకు చేసిన సేవలు అనిర్వచనీయమని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు తెచ్చుకొని ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడు తెలంగాణ వాదులపై పెట్టిన కేసులను సైకిల్ మీద భువనగిరి వెళ్లి వాళ్ల తరుపున ఉచితంగా వాదించి తిరిగి వచ్చేవారని ఇది వారి మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శమన్నారు. ఆయన బిసిల అభ్యన్నతి కోసం ఎంతో కృషి చేశారని, యువత బాపూజీ మార్గదర్శకంగా తీసుకోని జీవనాన్ని సాగించాలని సూచించారు. ప్రభుత్వం ఆయన సేవలు గుర్తించి జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. మహాత్మాగాంధీ ఆశయాలను స్పూర్తిగా తీసుకుని ముందుకు నడిచిన వ్యక్తి బాపూజీ అన్నారు. క్రమశిక్షణ, దీక్ష, ధృడసంకల్పం కలిగిన బాపూజీ ఆందరికి ఆదర్శనీయులన్నారు. అనంతరం ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో డిఆర్‌ఓ సూర్యలత, డిప్యూటీ కలెక్టర్లు సంగీత, శ్రీనివాస, కలెక్టరేట్ సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.