Monday, December 23, 2024

మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన నేత కొండా లక్ష్మణ్ బాపూజీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడాలనే ఆకాంక్షతో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ టిఆర్‌ఎస్ ఆవిర్భావానికి తన ఇల్లు జలదృశ్యం వేదికగా చేసి మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదారని బిఎస్పీ అధ్యక్షులు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం హుస్సేన్ సాగర్ వద్ద జలదృశ్యంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ 11 వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో ఉద్యమకారులకు ప్రభుత్వం గుర్తింపు ఇచ్చి వారిని ఆదుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బిఎస్పీకి అధికారం కట్టబెట్టాలని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News