Saturday, December 21, 2024

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా కొండా మణెమ్మ

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ రూరల్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా మాజీ జెడ్పిటిసి కొండ మణెమ్మ మంగళవారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కించపరుస్తూ ఉంటే కేంద్రంలోని నరేంద్ర మోడి ప్రభు త్వం మహిళలకు పెద్దపీట వేయడంతో పాటు క్యాబినెట్లో కూడా అనేక మందికి అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి బండారాన్ని బయటపెట్టి రాబోయే ఎన్నికలలో ఆ పార్టీని భూస్థాపితం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు, జిల్లా ఇంచార్జి కొల్లు మాధవితో పాటు జాతీయ రాష్ట్ర జిల్లా నేతలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News