Thursday, January 23, 2025

తానా అంతర్జాతీయ కవి సమ్మేళనానికి ఎంపికైన కొండా మెహన్

- Advertisement -
- Advertisement -


మన తెలంగాణ,సిటీబ్యూరో: ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆజాదీకా అమృత మహోత్సవ ఉత్సవాలు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ కవితల పోటీలు నిర్వహించింది. ఈపోటీల్లో తెలంగాణ వరంగల్లు జిల్లా వలిమిడి గ్రామంలో పుట్టి హైదరాబాద్‌లోని జలమండలిలో డిస్ట్రిక్ ఫారెస్టు ఆఫీసర్‌గా డిపుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న కవి, రచయిత కొండా మెహన్ ఎంపికయ్యారు. ఈనెల 22,23,24 తేదీల్లో జూమ్‌లో తానా నిర్వహించబోతున్న ప్రపంచస్దాయి కవితా వేదిక మీద కొండా మెహన్ తమ కవితను వినిపించబోతున్నారు. ప్రపంచ యవనికపై దేశం గొప్పతనాన్ని, ప్రపంచం కళ్లు తెరవకముందే నాగరితక ఎలా పరిఢవిల్లినదో చాలా అద్భుతంగా వివరించిన వసుదైక కుటుంబకం అనే కవిత ఈ పోటీలో ఎంపికైంది. జలమండలి, రాష్ట్ర అటవీశాఖ ఖ్యాతిని ప్రపంచ స్దాయికి తీసుకువెళ్లిన కొండా మెహన్‌ను ఎండీ దానకిషోర్, పిసిసిఎఫ్ ఆర్. ఎం. డోబ్రియాల్, ఇంజనీర్లు, అధికారులు, మిత్రులు, కుటుంబసభ్యులు సాహితీవేత్తలు ప్రశంసలతో ముంచేత్తుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News