Thursday, January 23, 2025

కొండా దంపతుల జీవితంలో ట్విస్టులున్నాయి

- Advertisement -
- Advertisement -

Konda movie release

కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటే ల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కొండా సుష్మితా పటేల్ నిర్మాత. ఈనెల 23న ఈ సినిమా విడుదల కానుం ది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మీడియాతో మాట్లాడుతూ “విజయవాడ లో చదువుకోవడం వల్ల రౌడీయిజం మీద కొంత అవగాహన ఉంది. ‘రక్త చరిత్ర’ తీసినప్పుడు రాయలసీమ గురించి తెలిసింది.

నేను ఎప్పుడూ తెలంగాణను పట్టించుకోలేదు. రిటైర్డ్ పోలీస్ ఒకరిని కలిసినప్పుడు మాటల మధ్యలో కొండా మురళి గురించి చెప్పారు. ఎన్నికల సమయంలో సురేఖ ఇంటర్వ్యూలు చూశా. ఆమె గుర్తు ఉన్నా రు. కానీ కొండా మురళి పేరు గుర్తు లేదు. పోలీస్ చెప్పిన తర్వాత మాజీ నక్సలైట్లతో మాట్లాడాను. కొండా దంపతుల జీవితంలో ట్విస్టులు ఉన్నాయి. డ్రామా ఉంది. కథ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత కొండా ఫ్యామిలీని కలిసి సినిమా గురించి మాట్లాడా. ఇక ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తానని సుష్మితా అన్నారు. ముంబయ్ నేపథ్యంలో తీసిన సినిమాలకు, ‘రక్త చరిత్ర’కు… ఈ సినిమా నేపథ్యానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. త్రిగుణ్‌లో కొండా మురళి క్యారెక్టరైజేషన్ బాగా కుదిరింది.

అతను బాగా చేశాడు. కొండా మురళి, సురేఖ కాలేజీ జీవితం నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకు ‘కొండా’ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో గద్దర్‌తో కలిసి ఓ పాట పాడాను. ఇక ప్రస్తుతం ‘లడకీ’ చిత్రాన్ని హిందీలో తీశా. అమితాబ్ బచ్చన్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నా. అది హారర్ జానర్. నవంబర్‌లో ప్రారంభం కావచ్చు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News